24వ రాజ్యాంగ సవరణ ద్వారా (1971) పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరించటంలో సంపూర్ణ అధికారం ఉందని చట్టం చేయటం జరిగింది.
రాజ్యాంగంలో న్యాయ సమీక్షా పద్ధతిని అమెరికా నుంచి తీసుకున్నారు.
- రాజ్యాంగం ప్రకారం న్యాయసమీక్షాధికారం హైకోర్టు మరియు సుప్రీం కోర్టులకు ఉన్నది.
- గోలక్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ''ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరింపజాలదు'' అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
- 24వ రాజ్యాంగ సవరణ ద్వారా (1971) పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరించటంలో సంపూర్ణ అధికారం ఉందని చట్టం చేయటం జరిగింది.
- 24వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధతను సుంప్రీంకోర్టులో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సవాలు చేయటం జరిగింది.
ప్రాథమిక హక్కుల వర్గీకరణ
1. సమానత్వపు హక్కు - (14వ అధికరణం - 18వ అధికరణం)
2. స్వాతంత్య్రపు హక్కు - (19వ అధికరణం - 22వ అధికరణం)
3. పీడన నిరోధపు హక్కు - (23వ అధికరణం - 24వ అధికరణం)
4. మత స్వాతంత్రపు హక్కు - (25వ అధికరణం - 28వ అధికరణం)
5. విద్యా, సాంస్కృతిక హక్కు - (29వ అధికరణం - 30వ అధికరణం)
6. రాజ్యాంగ పరిహార హక్కు - 32 అధికరణం)
- పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించటానికి సంపూర్ణ అధికారం కలిగి ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
- రాజ్యాంగంలోని 368వ అధికరణం ప్రకారం పార్లమెంట్ రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించవచ్చు అని సుప్రీం కోర్టు పేర్కొంది.
- 19వ అధికరణం కింద పౌరులకు రాజ్యాంగం ఆరు రకాల స్వేచ్ఛలను ప్రసాదించింది.
- రాజ్యాంగం మొదటిసారి ఆమోదించినపుడు 19వ అధికరణంలో ఏడు రకాల స్వేచ్ఛలున్నాయి.
- ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడిన ప్రాథమిక హక్కు ఆస్తి హక్కు.
- ఆస్తి హక్కును 300(ఎ)లో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఇది చట్టబద్దమైన హక్కు మాత్రమే.
- ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది.
- ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి మొరార్జీదేశాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో తొలగించబడింది.
- 20వ అధికరణం నేరారోపణ చేయబడినపుడు నిర్దోషిత్వ నిరూపణకు అవకాశం కల్పిస్తుంది.
- 21వ అధికరణం ప్రకారం పైరులకు జీవించే మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉంటుంది.
- 352 అధికరణం అమలులో ఉన్నపుడు కొన్ని ప్రాథమిక హక్కులు వాటంటత అవే సస్పెండ్ అవుతాయి.
- 359వ అధిరణం ప్రకారం రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చు.
- 44వ రాజ్యాంగ సవరణ 20 మరియు 21 అధికరణాలను రద్దు చేయటాన్ని నిరోధిస్తుంది.
- జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు కూడా 20 మరియు 21 అధికరణాలు అమలులో ఉంటాయి.
- 14వ అధికరణం ప్రకారం సమానత్వపు హక్కు చట్టం ముందు అందరూ సమానం అనే నిబంధన పాటించాలి.
- సమానత్వపు హక్కు బ్రిటీష్ రాజ్యాంగం నుంచి స్వీకరించబడింది.
- చట్టం ముందు అందరూ సమానం అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించబడింది.
- 14వ అధికరణం ప్రకారం రాజ్యాంగంలో కొన్ని వర్గాల వారికి ప్రత్యేక సంరక్షణలు కల్పించవచ్చు.
- 14వ అధికరణంలోని చట్టం ముందు సమానత్వం అనేది రాజ్యాంగ మౌలిక లక్షణంగా భావించబడింది.
- 14వ అధికరణం పరిధిలోకి రాష్ట్రపతి, గవర్నర్‌లు రారు.
- 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా 14వ అధికరణం పరిధి తగ్గించబడింది.
- అంతర్జాతీయ చట్టం ప్రకారం రాయబారులు, దౌత్యవేత్తలకు న్యాయ విధానాల నుంచి పూర్తి పరిరక్షణ ఉన్నది.
- అత్యవసర పరిస్థితి ఉన్నపుడు 14వ అధికరణాన్ని రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు.
- 15వ అధికరణం ప్రకారం రాజ్యాంగం మత, జాతి, కుల, లింగ వివక్షను నిషేధించింది.
- 15వ అధికరణం పౌరులకు మాత్రమే వర్తిస్తుంది.
- 16వ అధికరణం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి.
- 81వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 16వ అధికరణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించబడినాయి.
- ప్రభుత్వ ఉద్యోగాలలో నివాసం, కొన్ని వెనుకబడిన వర్గాల ఆధారంగా నియామకాలు జరుపవచ్చు.
- 17వ అధికరణం అంటరానితనాన్ని ఏ తరహాలోనైనా అవలంభించటాన్ని నిషేధిస్తుంది.
- అంటరానితనం 1955 అంటరానితన నిరోధ చట్టం ప్రకారం శిక్షార్హమైనది.
- 1955 అంటరానితనం నిరోధ చట్టంనకు 1976లో సవరణలు చేశారు.
- పద్మ అవార్డులు (పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ) 18వ అధికరణానికి వ్యతికేకం కాదు.
- 'పద్మ' అవార్డులను 1954లో రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేశారు.
- 19వ అధికరణం కింద ప్రస్తుతం ఆరు రకాల ప్రాథమిక హక్కులున్నాయి.
- భారత రాజ్యాంగం ప్రత్యేకంగా పత్రికా హక్కును ఇవ్వలేదు.
- 20వ రాజ్యాంగ అధికరణ ప్రకారం ఒక వ్యక్తి చేసిన నేరానికి అతనినే సాక్షిగా ఉండాలని బలవంతపెట్టరాదు.
- ఒక వ్యక్తిని ఒకే నేరానికి రెండు సార్లు శిక్షించకూడదు అని రాజ్యాంగంలోని 20వ అధికరణం చెబుతుంది.
- అదుపులోకి తీసుకున్న లేదా అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటలలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని 22వ అధికరణం చెబుతుంది.
- వ్యక్తిని అదుపులో ఉంచుకొనవలసిన కాలాన్ని మేజిస్ట్రేట్ నిర్ణయిస్తాడు.
- వ్యక్తి యొక్క స్వేచ్ఛా స్వాతంత్య్రాలను 21వ అధికరణం శాసన వ్యవస్థ నుంచి, కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి రక్షిస్తుంది.
- ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొనవలసినపుడు అతనికి నేరం లేదా ఆరోపణ గురించి తెలియచేయకుండా అరెస్టు చేయకూడదని 21వ అధికరణం తెలియజేస్తుంది.
- రాజ్యాంగంలోని 23వ అధికరణం మానవుల రవాణా మరియు బలవంతపు చాకిరిని నిరోధిస్తుంది.
- పనికి ఇవ్వవలసిన వేతనం కంటే తక్కువ ఇవ్వటం 23వ అధికరణానికి ధిక్కారణ అని చెప్పవచ్చు.
-14 సంవత్సరాలలోపు పిల్లలచేత హానికర కర్మాగారాలలో పనిచేయించటం 24వ అధికరణం ప్రకారం చట్ట వ్యతిరేకం.
- 25వ అధికరణం ప్రకారం వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.
- 26వ అధికరణం ప్రకారం పౌరులు, ఇతరులకు భంగం కలిగించకుండా మత సంబంధమైన సంస్థలను నడుపుకునే వీలుంది.
- 29వ అధికరణం పౌరులకు విద్యా, సాంస్కృతిక విషయ హక్కులను కల్పిస్తుంది.
- 30వ అధికరణం మైనారిటీలకు విద్య, సాంస్కృతిక సంబంధమైన సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కల్పించింది.
- ప్రాథమిక హక్కుల పరిరక్షణ భారం సుప్రీం కోర్టు, హైకోర్టులు వహిస్తాయి.
- ప్రాథమిక హక్కులను సకారాత్మక, నకారాత్మక హక్కులుగా విభజించవచ్చు.
- అస్పృశ్యత నివారణా సకారాత్మకపు ప్రాథమిక హక్కు.
- దోపిడిని నిరోధించే హక్కు నకారాత్మక ప్రాథమిక హక్కు.
- రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రాథమిక హక్కులకు మూలం వంటిది.
- 21వ రాజ్యాంగ అధికరణం వ్యక్తి జీవితం, స్వేచ్ఛలకు గల రక్షణ గురించి తెలుపుతుంది.
- దేశ శాంతి భద్రతలకు, దేశ క్షేమానికి భంగం కలిగించవచ్చుననే అనుమానంతో ముందుగానే వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకోవటాన్ని నిరోధక నిర్బంధం అంటారు.
- పౌరులచేత నిర్భంధంగా చాకిరీ చేయించడాన్ని 23వ అధికరణం నిషేధిస్తుంది.
- మత స్వాతంత్య్రపు హక్కును గురించి రాజ్యాంగంలో 25 నుంచి 28 వరకు గల అధికరణలు తెలుపుతాయి.
- 26వ అధికరణం ప్రకారం మత పురోభివృద్ధికి మత సంస్థలను ఏర్పరచుకునే హక్కు అందరికీ కలదు.
- అల్పసంఖ్యాక వర్గాలకు సాంస్కృతిక, విద్యా హక్కులు 29 మరియు 30 అధికరణాల ప్రకారం కల్పించబడినాయి.
- రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులకు హృదయం వంటిది అని అంబేద్కర్ పేర్కొన్నారు.
- శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రాథమిక హక్కులను సవరించు అధికారం పార్లమెంట్‌కు కలదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
- ఆస్తి హక్కు ప్రస్తుత రాజ్యాంగంలో 300ఎ అధికరణ ప్రకారం చట్టబద్దమైన హక్కు మాత్రమే.
- సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు సైనిక వర్గాలలో పనిచేసే వారికి లేదు.
- హెరాల్డ్ లాస్కీ రాజ్యం లక్షణం గాని, స్వభావం గాని అది పౌరులకు కల్పించే హక్కులను బట్టి తెలుస్తాయి అన్నారు.
- బాలగంగాధర్ తిలక్ 1895లో స్వరాజ్య బిల్లును ప్రవేశపెట్టారు.
- 1931లో జరిగిన కరాచీ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక హక్కుల తీర్మానం ఆమోదించింది.
- ప్రాథమిక హక్కులను నిర్దారించటానికి ఆచార్య జె.బి.కృపలాని అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ఉపసంఘం ఏర్పాటు చేయబడింది.
- ఎ.వి.డైసి సమన్యాయం అనే భావనను ప్రతిపాదించారు.
- రాజ్యాంగంలోని 13వ అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు చెల్లుబడికావు.
- రాజ్యాంగంలోని 13వ అధికరణం సుప్రీం కోర్టుకు న్యాయసమీక్షాధికారం కల్పిస్తుంది.
- రాజ్యాంగంలోని 25వ నిబంధన ప్రకారం హిందూ మతం కిందకు హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు వస్తారు.
- నిర్బంధ ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా 86వ రాజ్యాంగ సవరణ చట్టం (93వ రాజ్యాంగ సవరణ బిల్లు) ద్వారా చేయటం జరిగింది.
- మోతీలాల్ నెహ్రూ నివేదికలో తొలుత ప్రాథమిక హక్కులు ప్రతిపాదించబడ్డాయి.
- మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్‌ను పోలి ఉంటాయి.
- మన రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు ఎ.వి.డైసి ప్రతిపాదించిన సమన్యాయం అన్న భావనను పోలి ఉంటుంది.
పౌరులు కాని వారికి లభ్యమయ్యే ప్రాథమిక హక్కులు
1. 14వ అధికరణం - సమానత్వపు హక్కు
2. 20వ అధికరణం - నేరాలకు సంబంధించిన దోష నిర్ణయంలో రక్షణ
3. 21వ అధికరణం - జీవితానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ
4. 23వ అధికరణం - మనుషుల రవాణా, వెట్టిచాకిరీ నిషేధం
5. 24వ అధికరణం - కర్మాగారంలో బాలకార్మికులతో పనిచేయించటం నిషేధం
6. 25వ అధికరణం - మత స్వాతంత్య్ర హక్కు
7. 26వ అధికరణం - మతపరమైన వ్యయ నిర్వహణకు స్వాతంత్య్రం
8. 27వ అధికరణం - మత అభివృద్ధికి బలవంతంగా పన్నుల వసూలు నిషేధం.

No comments:
Post a Comment